బందరు పోర్ట్ కల సాకారం కాకపోవడం దురదృష్టకరం: పేర్ని నాని
ABN , First Publish Date - 2022-11-30T12:08:00+05:30 IST
ప్రజల బందరు పోర్ట్ కల సాకారం కాకపోవడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు.

విజయవాడ : ప్రజల బందరు పోర్ట్ కల సాకారం కాకపోవడం దురదృష్టకరమని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బందరు పోర్ట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టనుందన్నారు. ఫిబ్రవరి లోపు పోర్ట్ పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. పోర్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకున్నామని వెల్లడించారు. రూ.5,253.89 కోట్లతో బందరు పోర్ట్ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రైలు, రోడ్డు నిర్మాణానికి భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్ని నాని తెలిపారు.
Read more