ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: చంద్రబాబు

ABN , First Publish Date - 2022-10-05T19:37:57+05:30 IST

తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు.

ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు: చంద్రబాబు

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మవారిని ప్రార్థించానని తెలిపారు. టీడీపీ హయాంలో రూ.150 కోట్లతో ఇంద్రకీలాద్రిపై వసతులు కల్పించామని, దుర్గమ్మ సాక్షిగా అమరావతే రాజధానిగా అన్ని పార్టీలు ఆమోదించాయని తెలిపారు. ఆనాడు వైసీపీ కూడా అమరావతి రాజధానికి మద్దతిచ్చిందని గుర్తుచేశారు. రాజధాని ప్రజల సంకల్పం గొప్పదన్నారు. అమరావతిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడడం సరికాదని తప్పుబట్టారు. మాటతప్పడం మంచి పద్ధతికాదని, మాటతప్పేవారిని అమ్మవారు ఉపేక్షించరని చంద్రబాబు హెచ్చరించారు.

Read more