పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు : నారా లోకేష్

ABN , First Publish Date - 2022-09-26T15:53:35+05:30 IST

‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.

పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు : నారా లోకేష్

అమరావతి : ‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ (Vundavalli Arun kumar) ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్లింగ్‌ను షేర్ చూస్తూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్సార్‌ (YSR)ను ప్రథమ ముద్దాయిని చేసింది స్వయంగా ఆయన కుమారుడేనని తెలిపారు.


‘సుప్రీంకోర్టు (Supreme Court) వరకూ వెళ్లి రాజశేఖరరెడ్డి ఆయన మంత్రి వర్గం కలిసి చేసిన తప్పిది.. నాకేంటి సంబంధం’ అని అప్పట్లో జగన్ అన్నారని ఉండవల్లి ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఉండవల్లి అప్పట్లో మాట్లాడిన వీడియో క్లిప్‌ (Video Clip)ను షేర్ చేసి నారా లోకేష్.. ‘‘‘పేటీఎం డాగ్స్! దిస్ ఈజ్ రియల్ వెన్నుపోటు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి అవినీతి కేసుల్లో వైఎస్సార్ ని ముద్దాయిని చేసింది దుర్మార్గపు కొడుకు జగన్ రెడ్డి. మీలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం లేదు. పక్కా ఆధారాలతో బయటపెడుతున్నా. వైఎస్సార్‌ని ప్రథమ ముద్దాయిని చేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే’’ అని నారా లోకేష్ ట్విటర్ వేదికగా చెప్పుకొచ్చారు. Updated Date - 2022-09-26T15:53:35+05:30 IST

Read more