YCP ప్రవేశపెట్టిన Navaratnalaపై నవ సందేహాలు.. Pawan tweet..

ABN , First Publish Date - 2022-07-08T16:29:18+05:30 IST

వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలపై నవ సందేహాలు అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

YCP ప్రవేశపెట్టిన Navaratnalaపై నవ సందేహాలు.. Pawan tweet..

అమరావతి (Amaravathi): వైసీపీ (YCP) ప్రవేశపెట్టిన నవరత్నాల (Navaratnala)పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawankalyan) ట్వీట్ (tweet) చేశారు. ‘‘మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?.. రెండో రత్నం: అమ్మ ఒడి, అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు?.. మూడో రత్నం: పెన్షన్లు.. పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?.. నాలుగో రత్నం: సంపూర్ణ మద్యపాన నిషేధం.. మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు... 2021-22లో రూ.22 వేల కోట్లు... ఇదేనా మధ్య విధం?.. ఈ ఆదాయం చూపించే రూ. 8వేల కోట్ల బండ్లు అమ్మలేదా?... అయిదో రత్నం: జల యజ్ఞం.. పోలవరం ప్రాజెక్టును 'యుద్ధ ప్రాతిపదిక' ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?.. ఆరో రత్నం: ఆరోగ్యశ్రీ.. ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి?.. సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?... ఏదో రత్నం: ఫీజు రీయింబర్స్మెంట్.. రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా?... పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?... ఎనిమిదో రత్నం: పేదలందరికీ ఇళ్ళు.. చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా?.. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?.. తొమ్మిదో రత్నం: ఆసరా పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు?.. అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-07-08T16:29:18+05:30 IST