అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా?: పవన్

ABN , First Publish Date - 2022-09-23T22:47:34+05:30 IST

అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా?: పవన్

అమరావతి: అరెస్టులతో జర్నలిస్టులను కట్టడి చేయాలని చూస్తున్నారా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) వైసీపీ ప్రభుత్వాన్ని(YCP GOVT) ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీనియర్ జర్నలిస్టు అంకబాబు అరెస్ట్.. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు.న్యాయమూర్తులను కించపరిచినవారిని ఎందుకు అరెస్ట్ చేయరని నిలదీశారు.గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన.. వార్తను జర్నలిస్టుల గ్రూప్‌లో పోస్ట్ చేశారన్నారు. అరెస్టు, కుట్రపూరిత నేరం కింద సెక్షన్ల నమోదు చూస్తుంటే..జగన్‌ ప్రభుత్వం ఉలిక్కిపడుతుందని అనిపిస్తోందని పవన్ కల్యాణ్‌ అన్నారు. 

Read more