-
-
Home » Andhra Pradesh » pawan directly questioned the ap government bbr-MRGS-AndhraPradesh
-
Pawan Kalyan: ఏపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన పవన్
ABN , First Publish Date - 2022-09-20T01:46:42+05:30 IST
ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అమరావతి: ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకని నిలదీశారు. మహిళలపై అఘాయిత్యాల్లో ఏపీ మొదటి 10 స్థానాల్లో ఉందని, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (National Crime Records Bureau) నివేదిక ఇచ్చిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ మౌనం ఆడబిడ్డలకు శాపంగా మారిందన్నారు. ఆడబిడ్డలకు ప్రభుత్వం ధైర్యం ఇవ్వలేకపోతోందని ధ్వజమెత్తారు. హోంమంత్రిగా ఉన్న మహిళ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. ఏపీలో క్రైమ్ రేట్ పెరుగుదల ప్రభుత్వ వైఫల్యమే కారణమని పవన్‌కల్యాణ్ ధ్వజమెత్తారు.