‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ పేరుతో పవన్ మరో వ్యంగ్య కార్టూన్..

ABN , First Publish Date - 2022-07-18T17:23:18+05:30 IST

ట్విటర్‌లో ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ అంటూ రోజుకో కార్టూన్‌తో ఏపీ రోడ్లు.. తద్వారా సీఎం జగన్‌ తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎండగడుతున్న విషయం తెలిసిందే.

‘గుడ్ మార్నింగ్ సీఎం సర్’ పేరుతో పవన్ మరో వ్యంగ్య కార్టూన్..

Amaravathi : ట్విటర్‌(Twitter)లో ‘గుడ్ మార్నింగ్ సీఎం సర్(Good morning CM Sir)’ అంటూ రోజుకో కార్టూన్‌తో ఏపీ రోడ్లు.. తద్వారా సీఎం జగన్‌(CM Jagan) తీరును జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఎండగడుతున్న విషయం తెలిసిందే. నేడు మరో కార్టూన్‌ను షేర్ చేశారు. ‘సీఎం జగన్ సర్... మేం పంపించిన ఈ కొత్త షూస్ వేసుకుని మళ్లీ ఒక్కసారి పాదయాత్ర చేయమని మా సవినయ మనవి’ అంటూ మన ప్రజల దగ్గర నుంచి లెటర్ సర్ అంటూ ఓ అధికారి జగన్‌కు వివరిస్తున్నట్టుగా ఉందా కార్టూన్. జగన్‌కి ప్రజలు రాసిన లేఖ, పంపిన షూ చూపిస్తున్న వ్యంగ కార్టూన్‌ను పవన్ పోస్టు చేశారు.

Read more