జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం: పట్టాభి

ABN , First Publish Date - 2022-07-07T22:44:42+05:30 IST

సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు.

జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం: పట్టాభి

అమరావతి: సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల విలీన ప్రక్రియతో ఏపీలో 8 వేల పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మారుస్తోంది స్కూళ్ల రూపురేఖలు కాదు... బడులకు బడులనే మాయం చేసేస్తున్నాడని దుయ్యబట్టారు. రూ. 2వేల కోట్ల అప్పు కోసం విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. చిన్నారుల పాలిట జగన్ కంసమామ అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాపాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలి రోజే ఆందోళనకు దిగారు. మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు.  విలీనానికి స్వస్థి పలకాలని డిమాండ్‌ చేశారు. 

Read more