పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..

ABN , First Publish Date - 2022-09-05T13:42:21+05:30 IST

క్రోసూరు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. మణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపు నందు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపులోని టీవీలతో

పల్నాడు జిల్లాలో అగ్నిప్రమాదం..

పల్నాడు జిల్లా : క్రోసూరు మండలంలో అగ్నిప్రమాదం జరిగింది. మణికంఠ ఎలక్ట్రానిక్స్ షాపు నందు మంటలు ఎగిసిపడుతున్నాయి. షాపులోని టీవీలతో పాటు పక్కన వున్న రెండు షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వినాయక నిమజ్జన ఊరేగింపులలో బాణాసంచాతో పేల్చడం వల్ల మంటలు వ్యాపించి వుంటాయని అంటున్న స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more