-
-
Home » Andhra Pradesh » One state is one capitalTDP slogan MP Rammohan Naidu mvs-MRGS-AndhraPradesh
-
AP News: ఒక రాష్ట్రం ఒక రాజధాని..టీడీపీ నినాదం: ఎంపీ రామ్మోహన్ నాయుడు
ABN , First Publish Date - 2022-09-18T03:16:43+05:30 IST
విశాఖ: టీడీపీ నినాదం ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Ram Mohan Naidu) పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి (Amaravathi)నే కొనసాగించాలని.. అమరావతి రైతులు చేపడుతున్న యాత్రను చూసి జగన్ భయపడుతున్నారని

విశాఖ: టీడీపీ నినాదం ‘ఒక రాష్ట్రం ఒక రాజధాని’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు (MP Ram Mohan Naidu) పేర్కొన్నారు. రాజధానిగా అమరావతి (Amaravathi)నే కొనసాగించాలని.. అమరావతి రైతులు చేపడుతున్న యాత్రను చూసి జగన్ భయపడుతున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతుల పాదయాత్రలో నిజాయితీ లేనప్పుడు ప్రజలు హర్షించరని, వారికి ప్రజల మద్దతు కూడా ఉండదని పేర్కొన్నారు. అమరావతి రైతులు చెబుతున్న మాటలతో ప్రజలు ఎక్కడ చైతన్య వంతులు అవుతారో అన్న భయం వైసీపీకి వెంటాడుతుందని, అందుకే రైతు యాత్రలకు భంగం కలిగించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ అమరావతి రైతులకు అండగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.