AP News: కుక్కను గన్‌తో కాల్చి చంపిన పాస్టర్

ABN , First Publish Date - 2022-10-01T19:31:13+05:30 IST

మూగజీవం పట్ల ఓ పాస్టర్ కర్కశంగా ప్రవర్తించాడు. ఇంట్లో విశ్వాసంగా ఉండే కుక్కను చర్చి పాస్టర్ ఎయిర్‌గన్‌తో కాల్చి చంపాడు.

AP News: కుక్కను గన్‌తో కాల్చి చంపిన పాస్టర్

ఎన్టీఆర్: మూగజీవం పట్ల ఓ పాస్టర్ కర్కశంగా ప్రవర్తించాడు. ఇంట్లో విశ్వాసంగా ఉండే కుక్కను చర్చి పాస్టర్ ఎయిర్‌గన్‌తో కాల్చి చంపాడు. జిల్లాలోని నందిగామ మండలం అడవిరావులపాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాస్టర్ గతంలో ఏపీఎస్పీ పోలీస్ బెటాలియన్‌లో విధులు నిర్వహించి రాజీనామా చేశాడు. అనంతరం మిషనరి పాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం అతని వద్ద ఉన్న ఎయిర్ గన్‌తో కుక్కను కాల్చిచంపాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే పాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎయిర్ గన్ ఎలాంటి సందర్భంలో వినియోగించాలనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more