ఎన్నికల కార్యకలాపాల్లో వలంటీర్లు వద్దు

ABN , First Publish Date - 2022-09-17T09:56:37+05:30 IST

ఎన్నికల కార్యకలాపాల్లో వలంటీర్లు వద్దు

ఎన్నికల కార్యకలాపాల్లో వలంటీర్లు వద్దు

కలెక్టర్లకు ఎస్‌ఈసీ ఆదేశాలు

అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఓటరు కార్డుకు ఆధార్‌ను అనుసంధానించే బాధ్యతల నుంచి వలంటీర్లను తప్పించాలని శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా ఆదేశాలిచ్చారు. ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలన్నారు. వారిని ఎన్నికల జాబితా నమోదు కార్యకలాపాల్లోనూ వినియోగించవద్దని జిల్లాల ఎన్నికల అధికారులకు స్పష్టం చేశారు. కాగా, రాష్ట్రానికి చెందిన భారత్‌దేశం పార్టీ, ఇండియన్స్‌ ఫ్రంట్‌, జాతీయ తెలుగు అభివృద్ధి సేవా సమూహం పార్టీ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌ ఆదేశాలిచ్చింది. 

Read more