నో డౌట్‌.. విజ్ఞత కలిగిన సీఎం చంద్రబాబు

ABN , First Publish Date - 2022-04-05T09:14:30+05:30 IST

నో డౌట్‌.. విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విషయాన్ని నేను కాదనడం లేదు’ అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యానించారు....

నో డౌట్‌.. విజ్ఞత కలిగిన  సీఎం చంద్రబాబు

14 ఏళ్లు అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పాలించారు 

ఇప్పుడు జగన్‌ విప్లవాత్మకంగా పరిపాలిస్తున్నారు

సంక్షేమం అమలు పన్నుల ద్వారానే సాధ్యం

డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యలు


శ్రీకాకుళం, ఏప్రిల్‌ 4: ‘నో డౌట్‌.. విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ విషయాన్ని నేను కాదనడం లేదు’ అని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం కలెక్టరేట్‌ వద్ద సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ‘‘14 ఏళ్లు చంద్రబాబు అప్పటి పరిస్థితికి తగ్గట్లుగా పరిపాలించారు. నో డౌట్‌. విజ్ఞత కలిగిన సీఎం ఆయన. ఇప్పుడు సీఎం జగన్‌ విప్లవాత్మకంగా పరిపాలిస్తున్నారు. ఈ విషయాన్ని అభినందించలేక అభివృ ద్ధిని వెనక్కిలాగే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ప్రతిపక్ష నేతలు చిడతలు వాయిస్తున్నారు. దీనివల్ల చంద్రబాబు ప్రజల్లో చులకన అవుతున్నారు. ప్రజల్లో సీఎం జగన్‌ చిరస్థానం సంపాదించుకున్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే పన్నుల ద్వారానే సాధ్యం’’ అన్నారు. 

Read more