ఆటో లేదు.. సాయమూ అందలేదు

ABN , First Publish Date - 2022-07-18T08:31:55+05:30 IST

ఆటో లేదు.. సాయమూ అందలేదు

ఆటో లేదు.. సాయమూ అందలేదు

జగన్‌ పత్రికలో తప్పుడు ప్రచారం

పలమనేరులో ఆటో డ్రైవర్‌ మున్నా ఆగ్రహం


పలమనేరు, జూలై 17: ‘2008లో మహానేత వైఎస్‌ కల్పించిన అవకాశంతో ఆటో కొనుకొన్నా. జగనన్న వాహనమిత్ర ద్వారా నాకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు’.. అంటూ శనివారం జగన్‌ పత్రికలో ప్రచురితమైన వార్తను చూసి ఆ పత్రికలో పేర్కొన్న లబ్ధిదారుడు పలమనేరుకు చెందిన మున్నా ఆశ్చర్యపోయాడు. నాకు సొంత ఆటోనే లేదు. బాడుగ వాహనంతో జీవితం నెట్టుకొస్తున్నా. ఏమిటీ రాతలంటూ మండిపడ్డాడు. తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని, బాడుగ ఆటోతో జీవనం సాగిస్తున్న తనకు వైఎస్‌ అవకాశం కల్పించారని పేర్కొనడం సరికాదన్నారు. సాయం అందించకుండానే తన పేరు పెట్టి, తప్పుడు వార్తలు రాయడం తగదన్నారు.

Read more