కొత్తగా 244 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-02-23T08:15:27+05:30 IST

గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,803 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 244 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

కొత్తగా 244 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18,803 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 244 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మృతి చెందారు. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 23,16,711 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా... 22,96,430 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు పేర్కొంది. మొత్తం కరోనా మృతుల సంఖ్య 14716కు చేరగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,565 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది. 

Read more