AP News: కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి : శైలజానాథ్

ABN , First Publish Date - 2022-09-18T00:33:38+05:30 IST

Amaravathi: కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏపీసీసీ APCC అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Shailajanath) డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Seetaram), సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామా

AP News: కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి : శైలజానాథ్

Amaravathi: కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఏపీసీసీ APCC అధ్యక్షుడు సాకే శైలజానాథ్ (Shailajanath) డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni Seetaram), సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం ప్రతిబింబించేలా రాజ్యాంగ రచన చేసిన డాక్టర్ అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) అందరికి ఆదర్శప్రాయుడని, ఆయన పేరును  కొత్త పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితమని పేర్కొన్నారు. వ్యక్తిగతంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కొత్త పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానికి సిఎం  హోదాలో లేఖ రాయాలని జగన్‌ను శైలజానాథ్ కోరారు.  

 

Read more