సమాజసేవలో యువత ముందుండాలి

ABN , First Publish Date - 2022-11-30T23:29:13+05:30 IST

యువత సమాజసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్‌ అధికారి ఏ.మహేంద్రరెడ్డి అన్నారు.

సమాజసేవలో యువత ముందుండాలి
సమావేశంలో మాట్లాడుతున్న నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్‌ అధికారి మహేంద్రరెడ్డి

1పీడీకేఆర్‌ 30 :

పొదలకూరు, నవంబరు 30 : యువత సమాజసేవలో ఎల్లప్పుడూ ముందుండాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యూత్‌ అధికారి ఏ.మహేంద్రరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కాకతీయ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం సౌజన్యంతో కామాక్షి మహిళా మండలి ఆధ్వర్యంలో వలంటరీ ఎన్‌రోల్‌మెంట్‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరదలు, భూకంపాలు, సునామీ, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు యువత సమాజ సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. అందుకు సుముఖంగా ఉన్న విద్యార్థుల పేర్లను స్వచ్ఛందంగా నమోదు చేస్తామన్నారు. మూడేళ్ల తర్వాత వారికి ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్‌ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు కళాశాల ప్రాంగణంలో పూలమొక్కలు నాటారు. కార్యక్రమంలో కామాక్షి మహిళా మండల అధ్యక్షురాలు పి. రమణమ్మ, కన్వినర్‌ రమణయ్య, ప్రిన్సిపాల్‌ రఫీ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:29:13+05:30 IST

Read more