బాలాజీ జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తున్నాం

ABN , First Publish Date - 2022-02-17T04:57:24+05:30 IST

గూడూరును బాలాజీ జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం

బాలాజీ జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తున్నాం

గూడూరు, ఫిబ్రవరి 16: గూడూరును బాలాజీ జిల్లాలో కలపడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తూర్పువీధిలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ బాలాజీ జిల్లాలో యూనివర్సిటీలు, ప్రముఖ దేవాలయాలు, పారిశ్రామిక అభివృద్ధి ఉందన్నారు. దీంతో గూడూరును బాలాజీ జిల్లాలో కలపడం ద్వారా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అనంతరం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read more