వైసీపీ సినిమా అయిపోయింది

ABN , First Publish Date - 2022-12-30T23:54:36+05:30 IST

రాష్ట్రంలో ఇక వైసీపీ సినిమా అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 5 నుంచి పది సీట్లే వస్తాయి’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ జోస్యం చెప్పారు.

వైసీపీ సినిమా అయిపోయింది
వెంకటాచలం : జోడో యాత్ర కరపత్రాలను పంపిణీ చేస్తున్న చింతామోహన్‌

మనుబోలు, డిసెంబరు 30: ‘ రాష్ట్రంలో ఇక వైసీపీ సినిమా అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 5 నుంచి పది సీట్లే వస్తాయి’ అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్‌ జోస్యం చెప్పారు. రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు మద్దతుగా శుక్రవారం ఆయన మండలంలోని చెర్లో పల్లి, జట్లకొండూరు గ్రామాలు, దళితకాలనీలో పర్యటించి కరపత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ హయాంలోనే దళిత, గిరిజనులకు మేలు జరిగింద న్నారు. కాంగ్రెస్‌ను ఆదరిస్తే మళ్లీ రాష్ట్రంలో పేద, బడుగు, బలహీనవర్గాలకు న్యాయం జరు గు తుందన్నారు. కార్యక్ర మంలో సర్వేపల్లి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పూల చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

బ్యాలెట్‌ విధానాన్ని తీసుకు రావాలి

వెంకటాచలం : రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌ విధానంలో ఓటింగు జరిగేలా జాతీయ ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ కోరారు. మండలంలోని జోసఫ్‌పేట, సర్వేపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన భారత్‌ జోడో యాత్ర కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ దొంగచాటున గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ దొంగచాటున అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్ని స్తోందన్నారు.

Updated Date - 2022-12-30T23:54:36+05:30 IST

Read more