‘ వైసీపీ పాలనలో రాష్ట్రానికి చేసిందేమిటి?’

ABN , First Publish Date - 2022-10-04T03:37:59+05:30 IST

వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ అస్తులను ధ్వంసం చేయడం, పేర్లు మార్చడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏంటని టీడీ

‘ వైసీపీ పాలనలో రాష్ట్రానికి చేసిందేమిటి?’
గుడ్లూరు : దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న ఇంటూరి నాగేశ్వరరావు

 గుడ్లూరు, అక్టోబరు 3: వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రభుత్వ అస్తులను ధ్వంసం చేయడం, పేర్లు మార్చడం తప్ప రాష్ట్రానికి చేసిన మేలు ఏంటని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. హెల్త్‌ యూనివర్సిటీకి  పేరు మార్పును నిరసిస్తూ గుడ్లూరు బస్టాండ్‌ సెంటర్‌లో  పార్టీ నాయకులు, కార్యకర్తల సోమవారం నిరసన దీక్షలు చేపట్టారు. దీక్షల్లో పాల్గొన్న ఇంటూరి మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై తనకే ప్రేమ ఉందని చెప్పిన జగన్‌ ఆయన పేరును ఎందుకు మార్చారో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో  నాయకులు మద్దసాని కృష్ణ, జనిగర్ల నాగరాజు, ఉమ్మినేని సుబ్బారావు, నరాల మాలకొండారెడ్డి, మేకల మాల్యాద్రి, పువ్వాడి వేణుగోపాల్‌, రావూరి వేణు, పువ్వాడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


ఉలవపాడులో..


ఉలవపాడు : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి పేరు మార్చడంపై సోమవారం ఉలవపాడులోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నేతలు  నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు, నాయకులు పొదిలి శ్రీనివాసరావు, రాచగల్లు సుబ్బారావు, దన్యాసి శ్రీనివాసులు,  దార్ల యలమందమ్మ, సన్నెబోయిన ప్రభావతి, జంగాల కోటేశ్వరి,  తొట్టెంపూడి మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.


కొండాపురంలో..


కొండాపురం :  ఎన్టీఆర్‌ హెల్త్‌యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు అన్నారు. సోమవారం మండలంలోని ఆదిమూర్తిపురంలో ఉన్న ఎన్టీఆర్‌  విగ్రహం వద్ద పార్టీ నాయకులతో కలసి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి నిర్మాణాల చేపట్టకుండా ఉన్న భవనాలకు వైఎస్‌ఆర్‌ పేర్లు పెట్టుకోవడం జగన్‌ చేతకానితనానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు టీ.లక్ష్మీనారాయణ, యారవ క్రిష్ణయ్య, పీ.రమేష్‌,  సీహెచ్‌.వెంకటాద్రి, జాగర్లమూడి శ్రీను, దగడ మాలకొండారెడ్డి, మామిళ్లపల్లి వెంకటరమణయ్య, దాసరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.
Read more