కోదండరాముడి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

ABN , First Publish Date - 2022-04-06T03:41:43+05:30 IST

బుచ్చి పెద్దూరులో కొలువై ఉన్న సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలపై మంగళవారం నగర పంచాయ

కోదండరాముడి బ్రహ్మోత్సవాలపై సమీక్ష
బ్రహ్మోత్సవాలపై చర్చిస్తున్న కోదండరామస్వామి ఆలయ ధర్మకర్త, పాలక మండలి సభ్యులు, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం,ఏప్రిల్‌5: బుచ్చి పెద్దూరులో కొలువై ఉన్న సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలపై మంగళవారం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ సుప్రజ, పలు శాఖల అధికారులతో సమీక్షించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అఽధ్యక్షతన ఆలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ఈనెల 9 నుంచి 19వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు  తలెత్తకుండా ఏర్పాట్లు  చేస్తామని అధికారులు పేర్కొన్నారు.  స్వామి వారి రఽథోత్సవం, కల్యాణోత్సవం, తెప్పోత్సవం, గరుడసేవ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో హాజరయ్యే భక్తులకు  తాగునీరు, పారిశుధ్యం, వైద్య శిబిరం, బయోటాయిలెట్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముందుగా వారు ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ శ్రీనివాసరావు, సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ  వీరప్రతాప్‌, పలు శాఖల అధికారులు పలువురు కౌన్సిలర్లు ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Read more