వ్యాధులపై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2022-07-06T03:26:03+05:30 IST

ఆశా డే సందర్భంగా లింగసముద్రంలో పీహెచ్‌సీ అధికారులు, సిబ్బంది, ఆశాలు మంగళవారం వ్యాధులపై అవగాహన ర్యా

వ్యాధులపై అవగాహన ర్యాలీ
ఆశా డే సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైద్యాధికారులు

లింగసముద్రం, జూలై 5 :  ఆశా డే సందర్భంగా లింగసముద్రంలో పీహెచ్‌సీ అధికారులు, సిబ్బంది, ఆశాలు మంగళవారం వ్యాధులపై అవగాహన ర్యాలీ నిర్వహించా రు.వైద్యాధికారి పీ రమేష్‌ మాట్లాడుతూ, జూలై 1 నుంచి 31 వరకు డెంగ్యూ నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి లార్వా సర్వే చేయాలన్నారు.దోమలు పుట్టకుండా, కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల న్నారు.ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో  ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


Read more