వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన

ABN , First Publish Date - 2022-02-17T04:58:17+05:30 IST

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షలలో భాగంగా రెండవ రోజు బుధవారం

వీఆర్‌ఏల అర్ధనగ్న ప్రదర్శన

నాయుడుపేట టౌన్‌, ఫిబ్రవరి 16 : తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. రిలే నిరాహార దీక్షలలో భాగంగా రెండవ రోజు బుధవారం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించారు. వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను నెరవే ర్చే వరకు దీక్షలను కొనసాగిస్తామన్నారు. ఈ దీక్షలలో వీఆర్‌ఏల డివిజన్‌ అధ్యక్షుడు పెంచలయ్య, వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు పోలయ్య, సభ్యులు జమున, శ్యామల, సభ్యులు శ్యామలమ్మ,  గోవర్ధన్‌, సుబ్రమణ్యం, దివ్యభారతి, శేషయ్య తదితరులు పాల్గొన్నారు. 

Read more