వివాదాలు సృష్టించడం సరికాదు

ABN , First Publish Date - 2022-09-29T04:07:21+05:30 IST

గతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని ముదివర్తి దళిత కాలనీ వాసులు

వివాదాలు సృష్టించడం సరికాదు
విలేకరులతో మాట్లాడుతున్న ముదివర్తి దళిత కాలనీవాసులు

విడవలూరు, సెప్టెంబరు 28: గతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాల విషయంలో వివాదాలు సృష్టించడం సరికాదని ముదివర్తి  దళిత కాలనీ వాసులు   అన్నారు. గ్రామంలో బుధవారం  వారు విలేకరులతో మాట్లాడుతూ 2004లో 54 మందికి 18 అంకణాల చొప్పున పట్టాలు ఇచ్చారేకానీ స్థలాలు చూపటంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రసన్న చొరవతో రెవెన్యూ  అధికారులు స్థలాలు కేటాయించారని వివరించారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది  తమకు కేటాయించిన 18 అంకణాల స్థలాన్ని 14 అంకణాలకు తగ్గించి పంచాలని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు.  స్థలాన్ని తగ్గించి ఇస్తే కలెక్టరేట్‌  ఎదుట ఆందోళన చేస్తామన్నారు. సమావేశంలో దళిత కాలనీవాసులు చలం సుమలత, పట్టపు జ్యోతి, సోమతాటి సువార్తమ్మ, దొడ్ల నవీన్‌కుమార్‌, సోమతాటి కళాధర్‌, గోడ వజ్రమ్మ, డక్కా రమణమ్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-09-29T04:07:21+05:30 IST