వినికిడి మిషన్లు, యూనిఫాం అందజేత

ABN , First Publish Date - 2022-08-16T03:55:10+05:30 IST

పట్టణంలోని కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పు

వినికిడి మిషన్లు, యూనిఫాం అందజేత
దివ్యాంగ చిన్నారులకు వినికిడి మిషన్లు అందజేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

  కందుకూరు, ఆగస్టు 15: పట్టణంలోని కోవూరు రోడ్డులో ఉన్న స్వర్ణ స్వయంకృషి మానసిక దివ్యాంగుల పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఇంటూరి నాగేశ్వరరావు  రూ.60వేల తో విద్యార్థులకు యూనిఫాం, ఇద్దరికి వినికిడి మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండు నుంచి పాఠశాల వరకు దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం పాఠశాలలో నాగేశ్వరరావు సతీమణి సౌజన్యతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాలకు ఇంటూరి ప్రసాదు రూ. 10వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో దివి సౌభాగ్య, దామా మల్లేశ్వరరావు, షేక్‌ రఫి, పాఠశాల కరస్పాండెంట్‌ యస్‌. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Read more