-
-
Home » Andhra Pradesh » Nellore » vidyut sarafaralo antarayam ranivvam-MRGS-AndhraPradesh
-
విద్యుత్ సరఫరాలో అంతరాయం రానివ్వం
ABN , First Publish Date - 2022-02-20T02:56:06+05:30 IST
నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు ఏడీఈ జే రాము తెలిపారు. మండలంలోని వంజివాక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు

కోట, ఫిబ్రవరి 19: నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకున్నట్లు ఏడీఈ జే రాము తెలిపారు. మండలంలోని వంజివాక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద శనివారం విద్యుత్ వినియోగదారుల సదస్సు నిర్వహించారు. తిమ్మానాయుడుపాళెం, వంకివాక పంచాయతీల్లో పాత లైన్ల కారణంగా ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల సర్పంచులు నాగేళ్ల లక్ష్మి, అంకమ్మ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తక్షణం లైన్లు మార్చాలని కోరారు. సమావేశంలో ఏఈ సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.