విద్యార్థిని తల్లికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2022-09-25T03:13:50+05:30 IST

సొంతవారు కష్టాల్లో ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో తోటి విద్యార్థిని తండ్రి కేన్సర్‌తో వైద్యం చేయించుకునే లేక ఇబ్బం

విద్యార్థిని తల్లికి ఆర్థిక సాయం
విద్యార్థిని తల్లికి నగదు అందిస్తున్న హెచ్‌ఎమ్‌ అబ్దుల్‌ హమీద్‌

ఏఎస్‌ పేట,సెప్టెంబరు24: సొంతవారు కష్టాల్లో ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో తోటి విద్యార్థిని తండ్రి కేన్సర్‌తో వైద్యం చేయించుకునే లేక ఇబ్బందులు పడుతుంటే.. ఆ విద్యార్థులంతా కలసి సాయం చేశారు.  ఏఎస్‌ పేటలోని జడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి  చదువుతున్న విద్యార్ధిని వై హిమజ తండ్రి చిన్నకృష్ణయ్యకు కేన్సర్‌ సోకింది. ఆయన కుటుంబానికి వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కలసి రూ. 14, 500లను ఆమె తల్లికి శనివారం అందచేశారు. కానీ ఈ నగదు సరిపోదని, ఎవరైనా దాతలు సాయం అందించాలంటే 63056 89217 నెంబరుకు కాల్‌ చేసి మాట్లాడవచ్చని వారు పేర్కొన్నారు. వారి బ్యాంకు ఖాతానెం: 34912210036716,ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌:ఎస్‌వైఎన్‌బి 0003491 ద్వారా సహయం అందిచాలని హైస్కూల్‌ హెచ్‌ఎమ్‌ అబ్దుల్‌ హమీద్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుధాకర్‌,సురేష్‌,దొరబాబు,తదితరులు పాల్గొన్నారు.


Read more