వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ABN , First Publish Date - 2022-09-09T03:16:47+05:30 IST

మండలంలోని జీ.చెరువుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీమాత గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వే

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం
నూతనంగా ప్రతిష్ఠించిన మాత గంగాదేవి అమ్మవారు

ఉదయగిరి రూరల్‌, సెప్టెంబరు 8: మండలంలోని జీ.చెరువుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీమాత గంగాదేవి నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. వేదపండితులు అభిషేకాలు, హోమాలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేపట్టారు. కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం నిర్వహించారు. 


Read more