వేటగాళ్ళ ఉచ్చుకు దుప్పి బలి

ABN , First Publish Date - 2022-09-26T05:00:23+05:30 IST

వేటగాళ్ల ఉచ్చుకు చుక్కల దుప్పి బలైన ఘటన మండలంలోని ఓబులాయపల్లి చెరువు సమీపంలో జరిగింది.

వేటగాళ్ళ ఉచ్చుకు దుప్పి బలి
దుప్పిని పరిశీలిస్తున్న ఫారెష్ట్‌ అధికారులు

చేజర్ల, సెప్టెంబరు 25: వేటగాళ్ల ఉచ్చుకు చుక్కల దుప్పి బలైన ఘటన మండలంలోని ఓబులాయపల్లి చెరువు సమీపంలో జరిగింది. గ్రామస్థులు కథనం మేరకు.. గ్రామ చెరువు సమీపంలో ఆదివారం చుక్కల దుప్పి ఉచ్చులో చిక్కి చనిపోయి ఉండడం గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.  దీంతో డీఆర్వో కేవీ ప్రసాద్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. వేటగాళ్లకు సంబంధించిన కొన్ని వస్తువులు గుర్తించారు. అనంతరం చుక్కల దుప్పికి పంచనామా నిర్వహించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ అటవీ ప్రాణులపై దాడులు చేయడం నేరమని, దీనిపై సమీప గ్రామాల్లో విచారిస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కూడా పుట్టుపల్లి సమీపంలో దుప్పి మాంసం అమ్ముతున్నారన్న సమాచారంతో అప్పటి సబ్‌ డీఎఫ్‌వో, రాపూరు రేంజర్‌ గ్రామాల్లో విచారించి ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా అటవీ అధికారులు  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్ధానికులు కోరుతున్నారు.

Read more