వెంకటాచలంలో విక్రయ కేంద్రం ఏర్పాటు

ABN , First Publish Date - 2022-10-05T03:04:12+05:30 IST

: వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న దివ్యాంగురాలు పెటా భారతికి హోప్‌-4 స్పందన ఆర్గనైజేషన్‌ (యూ

వెంకటాచలంలో విక్రయ కేంద్రం ఏర్పాటు
దివ్యాంగురాలికి ఏర్పాటు చేయించిన బంకు

వెంకటాచలం, అక్టోబరు 4: వెంకటాచలం పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న దివ్యాంగురాలు పెటా భారతికి హోప్‌-4 స్పందన ఆర్గనైజేషన్‌ (యూఎస్‌ఏ ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన విక్రయ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. సుమారు రూ.75 వేలు వెచ్చించి బంకు ఏర్పాటు చేసి, అందులో ఫలసరుకుల విక్రయ కేంద్రం ద్వారా భారతికి జీవనోపాధి కల్పించారు. ఈ కేంద్రాన్ని ఆర్గనైజేషన్‌ సభ్యురాలు అఖిల పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్గనైజేషన్‌ నెల్లూరు ఇన్‌చార్జి రేవునూరు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

Read more