వెంకయ్యనాయుడుకి ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-10-05T03:00:14+05:30 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి సేవాభారతి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. సేవాభారతి కన్వీనర్‌ గంగవరపు వేణుగోపా

వెంకయ్యనాయుడుకి ఘన సన్మానం
వెంకయ్యనాయుడిని సన్మానిస్తున్న సేవా భారతి సభ్యులు

పొదలకూరు, అక్టోబరు 4: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి  సేవాభారతి ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. సేవాభారతి కన్వీనర్‌ గంగవరపు వేణుగోపాల్‌రెడ్డి, సభ్యులు శివకృష్ణారెడ్డి, పీ సురేంద్రరెడ్డి, ఎస్‌.దయాకర్‌రెడ్డి, వీ శ్రీనివాసులురెడ్డి, మాముడూరు రవీంద్రబాబు, చింతగింజల చినసుబ్రహ్మణ్యం, సిరిగిరి ఓబులేసు, దాసరి సురేంద్రబాబు  తదితరులు ఆయన్ను శాలువా, పుష్షగుచ్ఛాలతో సత్కరించారు. మండలంలోని ప్రభగిరిపట్నం వద్ద నున్న కిసాన్‌ క్రాఫ్ట్‌ కేంద్రాన్ని మంగళవారం ఉదయం వెంకయ్యనాయుడు సందర్శించిన సందర్భంగా వారు ఆయన్ను సన్మానించారు.


Read more