-
-
Home » Andhra Pradesh » Nellore » varada panullo avineeti polamreedi-MRGS-AndhraPradesh
-
వరద మరమ్మతు పనుల్లో అవినీతి : పోలంరెడ్డి
ABN , First Publish Date - 2022-08-18T03:30:31+05:30 IST
గత ఏడాది వరదలకు దెబ్బతిన్న పెన్నా పొర్లుకట్టల మరమ్మతులకు ప్రభుత్వ విడుదల చేసిన సుమారు రూ.100 కోట్ల ఎఫ్

బుచ్చిరెడ్డిపాళెం,ఆగస్టు 17: గత ఏడాది వరదలకు దెబ్బతిన్న పెన్నా పొర్లుకట్టల మరమ్మతులకు ప్రభుత్వ విడుదల చేసిన సుమారు రూ.100 కోట్ల ఎఫ్డీఆర్ నిధుల వ్యయంలో అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. బుధవారం బుచ్చి టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పొర్లుకట్టల పనుల కోసం ఎఫ్ఢీఆర్ నిధులు ఎంత మంజూరు చేశారు... ఎన్ని పనులు చేపట్టారు.. ? ఏ మండలానికి ఎన్ని నిధులు ఇచ్చారు... అసలు టెండర్లు నిర్వహించారా... నిర్వహిస్తే టెండరు దారులు ఎవరన్న వివరాలను రైతులకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలను కోరినట్టు తెలిపారు. పెన్నానదిలో ఇసుకను అమ్ముకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలంరెడ్డి దినేష్‌రెడ్డి, ఎంవీ. శేషయ్య, బత్తల హరికృష్ణ, నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, విజం రామానాయుడు, చెముకుల కృష్ణచైతన్య, సురేష్‌రెడ్డి, పాణెం వెంకురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-------------