వీఏఏల పనితీరుపై విచారణ

ABN , First Publish Date - 2022-09-30T03:34:09+05:30 IST

ఇటీవల అల్లూరు మండలం సస్పెన్షన్‌ గురైన గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏల) పనితీరుపై గురువారం క్షేత్రస్థాయి పరిశీల

వీఏఏల పనితీరుపై విచారణ
రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు

అల్లూరు, సెప్టెంబరు 29 : ఇటీవల అల్లూరు మండలం సస్పెన్షన్‌ గురైన గ్రామ వ్యవసాయ సహాయకుల (వీఏఏల) పనితీరుపై గురువారం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. నెల్లూరు డీడీఏ జీ శివనారాయణ, ఏడడీఏ ఎన్‌.శ్రీనివాసరావులు మండలం వ్యవసాయాధికారి వేణుగోపాల్‌రావుతో కలసి ఈ పరిశీలన చేపట్టారు. ఈ-పంట నమోదులో అవకతవకలకు పాల్పడిన వారిని జిల్లా కలెక్టరు సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి పనితీరుపై అధికారులు  పరిశీలనను చేపట్టారు.  ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించడంతోపాటు రైతుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. తాము సేకరించిన వివరాల నివేదికను జిల్లా అధికారులకు అందజేస్తామని వారు పేర్కొన్నారు.


Read more