సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-09-09T04:33:36+05:30 IST

సహకార బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈవో శంకర్‌బాబు అన్నారు.

సహకార బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోండి
లాకర్‌ను ప్రారంభిస్తున్న సీఈవో శంకర్‌బాబు

 సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈవో శంకర్‌బాబు

తోటపల్లిగూడూరు, సెప్టెంబరు 8 : సహకార బ్యాంకు సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సెంట్రల్‌ బ్యాంక్‌ సీఈవో శంకర్‌బాబు అన్నారు. తోటపల్లి గూడూరు సహకార బ్యాంకు సొసైటీలో అధునాతనంగా ఏర్పాటు చేసిన లాకర్‌ను ఆయన ముఖ్య అతిథిగా గురువారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారంపై రుణాలను ఇచ్చేందుకు సొసైటీ బ్యాంకు ఈ లాకర్‌ ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏ బ్యాంకులోనైనా రుణాలకు ఒక రోజంతా వేచి ఉండాలని, కానీ ఈ సొసైటీలో 20 నిమిషాల్లో ఒక గ్రాముకు రూ.3500 చొప్పున పొందవచ్చునని తెలిపారు. సొసైటీ లాభాల బాటలో ఉండడానికి సిబ్బందే కారణమన్నారు. జిల్లా సహకార బ్యాంకు ప్రతినిధి తిరుపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు మూడు గోదాములు మంజూర య్యాయని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌ కోపరేషన్‌ అధికారి సుధాభారతి, తోటపల్లిగూడూరు సొసైటీ అధ్యక్షుడు హరిచంద్రరెడ్డి, సొసైటీ సీఈవో నాగరాజు, ఏఎంసీ డైరెక్టర్‌ మన్యం సుబ్రహ్మణ్యం, సిబ్బంది వరప్రసాద్‌, కృష్ణారెడ్డి, సుబ్బయ్య, జడ్పీటీసీ శేషమ్మ, రైతులు పాల్గొన్నారు. 

Read more