‘ఉపాధి’ పనులు వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-11-23T23:30:32+05:30 IST

మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేసే దిశగా గ్రామసభలు నిర్వహించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వర్క్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి ఆమోదింప జేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులు పేర్కొన్నారు.

‘ఉపాధి’ పనులు వేగవంతం చేయాలి
మాట్లాడుతున్న ఎంపీడీవో సి శ్రీనివాసులు

ఆత్మకూరు, నవంబరు 23 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వేగవంతం చేసే దిశగా గ్రామసభలు నిర్వహించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వర్క్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి ఆమోదింప జేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసులు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఉపాధి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఆయా గ్రామ సర్పంచులు, కార్యదర్శులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున పంట కాలువల పనులు త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో శిరీష, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

===

Updated Date - 2022-11-23T23:30:32+05:30 IST

Read more