ఉత్తమ విద్యా ప్రమాణాలతో ఉన్నతమైన కెరీర్‌

ABN , First Publish Date - 2022-02-20T04:44:22+05:30 IST

ఉత్తమ విద్యా ప్రమాణాల ద్వారానే ఉన్నతమైన కెరీర్‌ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ పేర్కొన్నారు.

ఉత్తమ విద్యా ప్రమాణాలతో ఉన్నతమైన కెరీర్‌
సభలో మాట్లాడుతున్న డీఈవో రమేష్‌

డీఈవో రమేష్‌


ముత్తుకూరు, ఫిబ్రవరి 19 : ఉత్తమ విద్యా ప్రమాణాల ద్వారానే ఉన్నతమైన కెరీర్‌ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్‌ పేర్కొన్నారు. ముత్తుకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన కెరీర్‌ డే సెలబ్రేషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ ఉన్నత చదువులకు పునాది పాఠశాలల్లోనే ఏర్పడుతుందన్నారు. పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణులై తమ కెరీర్‌ను మంచి దిశలో కొనసాగించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన నిపుణులు విద్యార్థులకు కెరీర్‌ అవకాశాల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈవో మధుసూదన్‌, గండవరపు సుగుణ, ఉప సర్పంచు కాకుటూరు అనితరెడ్డి, తల్లిదండ్రుల కమిటీ చైర్మన్‌ జ్యోతి, ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య, తదితరులు పాల్గొన్నారు.  

Read more