డాక్టర్‌ ఠాగూర్‌పై విచారణ

ABN , First Publish Date - 2022-05-31T03:12:18+05:30 IST

స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డాక్టర్‌ ఠాగూర్‌పై అదనపు జిల్లా వైద్యశాఖాధికారి, ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ అధికారి సీవీ రమాదేవి విచారణ చేపట్టారు.

డాక్టర్‌ ఠాగూర్‌పై విచారణ
ఉదయగిరి వైద్యశాలలో విచారణ చేస్తున్న డీఎల్‌వో రమాదేవి

ఉదయగిరి, మే 30: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం డాక్టర్‌ ఠాగూర్‌పై అదనపు జిల్లా వైద్యశాఖాధికారి, ఎయిడ్స్‌ అండ్‌ లెప్రసీ అధికారి సీవీ రమాదేవి విచారణ చేపట్టారు. 2020వ సంవత్సరం ఫిబ్రవరిలో ఇక్కడ వైద్యాధికారిగా పని చేసిన ఠాగూర్‌పై ఇదే వైద్యశాలలో పని చేస్తున్న స్టాఫ్‌నర్సు ఫిర్యాదు మేరకు కేసు నమోదై సస్పెండ్‌ అయ్యారు. అందుకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టి పలువురి సిబ్బంది నుంచి లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని రమాదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ శ్రీనివాసులు, డీడీవో హాసినా తదితరులు పాల్గొన్నారు.

Read more