తిరుమలాపురం గిరిజనుల ధర్నా

ABN , First Publish Date - 2022-03-05T03:33:07+05:30 IST

తమ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మండలంలోని తిరుమలాపురం ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

తిరుమలాపురం గిరిజనుల ధర్నా
ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న గిరిజనులు

ఉదయగిరి రూరల్‌, మార్చి 4: తమ కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మండలంలోని తిరుమలాపురం ఎస్టీ కాలనీ వాసులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ 60 కుటుంబాలు కలిగిన కాలనీలో ఒక బోరు మాత్రమే ఉండడం, అందులో కూడా నీరు రాకపోవడంతో రెండు నెలలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కాలనీ చుట్టూరా అటవీ ప్రాంతం ఉండడం, వీఽధిదీపాలు లేకపోవడంతో విషపురుగుల బెడద అధికంగా ఉందని వాపోయారు. దుంపవారిపల్లి గ్రామం నుంచి కాలనీకి వచ్చే రహదారి పూర్తిగా కంపచెట్లతో నిండుకొనిపోవడంతో రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలుగుతుందన్నారు. కాలనీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సర్పంచ్‌, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఇన్‌చార్జి ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. 

Read more