నెల్లూరీయుడికి తెలంగాణ సారస్వత పురస్కారం

ABN , First Publish Date - 2022-09-25T05:37:58+05:30 IST

నెల్లూరీయుడైన న్యూఢిల్లీలోని ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ రేవూరి అనంతపద్మ నాభరావుకు తెలంగాణ సారస్వత పరిషత్‌ విశిష్ట పురస్కారం లభించిందని శనివారం ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు.

నెల్లూరీయుడికి తెలంగాణ సారస్వత పురస్కారం
డాక్టర్‌ అనంతపద్మనాభరావు

 మాజీ ఉపరాష్ట్రపతి నుంచి 13న ప్రదానం

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి) సెప్టెంబరు 24 : నెల్లూరీయుడైన   న్యూఢిల్లీలోని ఆకాశవాణి విశ్రాంత డైరెక్టర్‌ డాక్టర్‌ రేవూరి అనంతపద్మ నాభరావుకు తెలంగాణ సారస్వత పరిషత్‌ విశిష్ట పురస్కారం లభించిందని  శనివారం ఈ మేరకు నిర్వాహకులు ప్రకటించారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురుదేవులు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్ఞానకి రామశర్మ పేరుతో ఈ పురస్కారం ఏర్పాటు చేశారు.  వచ్చేనెల 13వ తేదీ 5గంటలకు హైదరాబాద్‌లోని దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో రామశర్మ జయంతి రోజున వెంకయ్య నాయుడు పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు. డాక్టర్‌ కేఐ వరప్రసాద్‌రెడ్డి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అతిథులుగా పాల్గొంటారని  పేర్కొన్నారు. సాహితీ, చరిత్ర రంగాలలో కూడా విశేష కృషి చేసిన అనంత పద్మనాభరావుకు పురస్కారం ప్రకటించడంపై పలువురు సాహితీ, కళాభిమానులు హర్షం వెలిబుచ్చారు. 


Read more