త్రైతసిద్ధాంతంపై అవగాహన

ABN , First Publish Date - 2022-10-03T05:05:51+05:30 IST

మండలంలోని వరికుంటపాడు, కాకొల్లువారిపల్లి గ్రామాల్లో దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం దుత్తలూరుకు చెందిన త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందు జ్జానవేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

త్రైతసిద్ధాంతంపై అవగాహన
ప్రచారం నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు

వరికుంటపాడు, అక్టోబరు 2: మండలంలోని వరికుంటపాడు, కాకొల్లువారిపల్లి గ్రామాల్లో దసరా మహోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం దుత్తలూరుకు చెందిన త్రైతసిద్ధాంత ప్రబోధ సేవాసమితి ఇందు జ్జానవేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు జీ.ప్రసాద్‌ మాట్లాడుతూ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు రచించిన త్రైతసిద్థాంత భగవద్గీత, అనుబంధ ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రజలకు పరిచయడం చేయడమే ప్రధాన లక్ష్యమన్నారు. అలాగే పరమాత్మ, దసరా ప్రాముఖ్యలను వివరించారు. కార్యక్రమంలో సభ్యులు సుధాకర్‌, పెంచలరత్నం, నరసింహులు, నవీన్‌కుమార్‌, భరత్‌, వెంకటేశ్వర్లు, రమణమ్మ, రత్తయ్య, ఇంద్రసేన, గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-10-03T05:05:51+05:30 IST