టీకా కార్యక్రమం పరిశీలన

ABN , First Publish Date - 2022-01-04T03:32:58+05:30 IST

కోవూరులోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం టీకాల కార్యక్రమాన్ని డీపీవో ధనలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సంద

టీకా కార్యక్రమం పరిశీలన
కోవూరు : టీకాల కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డీపీవో ధనలక్ష్మి

 కోవూరు,జనవరి3 : కోవూరులోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం టీకాల కార్యక్రమాన్ని డీపీవో ధనలక్ష్మి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 15 నుంచి 18 ఏళ్లలోపు బాల బాలికలందరికీ వైద్యసిబ్బంది కొవిడ్‌ టీకాలు వేయాలన్నారు. టీకాల ద్వారా కొవిడ్‌ను ఎదుర్కోగలమని చెప్పారు. ఆమె వెంట తహసీల్దారు సీహెచ్‌ సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి తదితరులు ఉన్నారు. అనంతరం ఆమె జగనన్న ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించారు. 

ఇందుకూరుపేట : మండలంలోని పలు హైస్కూళ్లలో సోమవారం వ్యాక్సిన్‌ కార్యక్రమం మొదలైంది. మైపాడు, జగదేవిపేట పీహెచ్‌సీలకు 1450 కోవాక్సిన్‌ టీకాలు రాగా, 750 మందికి వ్యాక్సిన్‌లు వేశారు. మండలంలోని ఆరు హైస్కూళ్లలో వైద్యాధికారులు తమ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

పొదలకూరు : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, విజ్ఞాన్‌ కాలేజీలలో సోమవారం 15 నుంచి 18  ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేపట్టారు. మహమ్మదాపురం పీహెచ్‌సీ డాక్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, ఎంపీటీసీ సోమ అరుణ, సర్పంచి మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచి వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎంఈవో బాలకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 
Read more