బైకులతో టీడీపీ నేతల భారీ ప్రదర్శన

ABN , First Publish Date - 2022-10-15T05:20:00+05:30 IST

టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో శుక్రవారం బైకులు, కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

బైకులతో టీడీపీ నేతల భారీ ప్రదర్శన
కోవూరులో పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు

పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి ఘన స్వాగతం

 కోవూరు, అక్టోబరు14: టీడీపీ కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా పోలంరెడ్డి దినేష్‌రెడ్డి  బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టణంలో శుక్రవారం బైకులు, కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పోతిరెడ్డిపాళెం మజరా సాలుచింతల వద్ద దినేష్‌రెడ్డికి నాయకులు, కార్యకర్తలు గజమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. పట్టణంలో దారిపొడవునా కర్పూరహారతులు ఇచ్చారు. బజారుకూడలిలో పెద్దసంఖ్యలో మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీసి ఆహ్వానించారు.  మందబయలు, మైఽథిలి కూడళ్లలో ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ దినేష్‌తో కలిసి ప్రదర్శనలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు సన్నపురెడ్డి వేణుగోపాలరెడ్డి, చెముకుల చైతన్య, ఇంతామల్లారెడ్డి,అశోక్‌రెడ్డి, బాలరవి, శేషయ్య, వీరేంద్ర, మాతూరు శ్రీనివాసులురెడ్డి, చెముకుల శ్రీనివాసులు, జెట్టి రాజగోపాలరెడ్డి, కొల్లా సుధాకరరెడ్డి, కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, సత్యవోలు సత్యంరెడ్డి, చక్కా మధుసూదన్‌,కరకటి మల్లిఖార్జున, యాకసిరి వెంకటరమణమ్మ, బాలరవి పాల్గొన్నారు. 

బుచ్చిరెడ్డిపాళెం : పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి సాలు చింతల వద్ద బుచ్చిరెడ్డిపాళెం మండలం నుంచి సుమారు 200మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు బైక్‌ ర్యాలీతో వెళ్లి స్వాగతం పలికారు. ముందుగా బుచ్చితోపాటు మండలంలోని అన్ని గ్రామాల నుంచి దామరమడుగు వద్దకు చేరుకుని అక్కడి నుంచి బైక్‌ ర్యాలీతో బయలుదేరారు.

ఇందుకూరుపేట : పోలంరెడ్డి దినేష్‌రెడ్డికి కోవూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఇచ్చిన సందర్భంగా  మండలం నుంచి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పున్నూరు గ్రామం నుంచి టీడీపీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పోన్నాబోయిన చెంచుకిషోర్‌ యాదవ్‌ ఆధ్వరన్యంలో పెద్ద ఎత్తున బైక్‌ ర్యాలీతో ఊరేగింపుగా బయలుదేరారు.  కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రావెళ్ల వీరేంద్ర చౌదరి, టీడీపీ సీనియర్‌ నాయకులు కొండూరు సుధాకర్‌రెడ్డి, గంపల అనీల్‌, దేవిరెడ్డి రవీంద్రరెడ్డి, ఈదూరు చెన్నయ్య, బాలబొమ్మ వెంకటేశ్వర్లు, వై.రామచంద్రయ్య, ఎం.రాంప్రసాద్‌, ఎం.రమేష్‌నాయుడు, సీహెచ్‌.సుధాకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మధుసూదన్‌రెడ్డి, మండల తెలుగు యువత అధ్యక్షులు కె.వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 

Read more