ముందరపొట్టెమ్మకు మాలేపాటి పూజలు

ABN , First Publish Date - 2022-09-28T04:38:00+05:30 IST

కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీలోని ముందరపొట్టెమ్మ ఆలయంలో దగదర్తి మండల నాయకుడు ముప్పాల వెంకటేశ్వర్లు మంగళవారం పొంగళ్ల కార్యక్రమం నిర్వహించారు.

ముందరపొట్టెమ్మకు మాలేపాటి పూజలు
మాలేపాటిని సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

కావలి రూరల్‌, సెప్టెంబరు 27: కావలి మండలం అన్నగారిపాలెం పంచాయతీలోని ముందరపొట్టెమ్మ ఆలయంలో దగదర్తి మండల నాయకుడు ముప్పాల వెంకటేశ్వర్లు మంగళవారం పొంగళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపాకటాక్షంతో వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాలేపాటిని శాలువా వేసి సన్మానించారు. కార్యక్రమంలో దగదర్తి, కావలి మండలాల నాయకులు ముప్పాళ్ల సురేష్‌, కంచర్ల గోపాలయ్య, రాధాకృష్ణయ్య, పులగం రామారావు, పులి సుధాకర్‌, రమేష్‌, రమణ, వాయిల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.


Read more