నగరాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నారు

ABN , First Publish Date - 2022-02-17T04:31:45+05:30 IST

నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడం చేతకాక భ్రష్ఠుపట్టిస్తున్నాడని మంత్రి అనిల్‌పై తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్‌చార్జి కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణలు చేశారు.

నగరాన్ని భ్రష్ఠుపట్టిస్తున్నారు
మాట్లాడుతున్న కోటంరెడ్డి

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 161 స్థానాలు

టీడీపీ సిటీ ఇన్‌చార్జి కోటంరెడ్డి

నెల్లూరు (వ్యవసాయం), ఫిబ్రవరి 16 : నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేయడం చేతకాక భ్రష్ఠుపట్టిస్తున్నాడని మంత్రి అనిల్‌పై తెలుగుదేశం పార్టీ సిటీ ఇన్‌చార్జి కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోపణలు చేశారు. నగరంలోని 7వడివిజన్‌లో టీడీపీ ఆధ్వర్యంలో బుధవారం గౌరవ సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ మంత్రి మాయమాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూ రి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని  శాశనసభలో అవమానించిన వైసీపీ నాయకులు సర్వనాశనం అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరు స్తూ ఉంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మౌనంగా నవ్వుకుంటూ ఉండడం బాధాకరమన్నా రు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ 161 స్థానాలు కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ తాళ్లపాక అనూరాధ, టీడీపీ నగర అధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు, పార్టీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కప్పిర శ్రీనివాసులు, రేవతి, తెలుగు యువత నాయకుడు తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Read more