వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

ABN , First Publish Date - 2022-10-02T04:11:27+05:30 IST

సీఎం జగన్మోహన్‌రెడ్డి అనుసరి స్తున్న అనాలోచిత, తుగ్లక్‌ విధానాలతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి


కోవూరు, అక్టోబరు1 : సీఎం జగన్మోహన్‌రెడ్డి అనుసరి స్తున్న అనాలోచిత, తుగ్లక్‌ విధానాలతో విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించనున్నారని   మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఎన్జీవో భవనంలో టీడీపీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షశిబిరంలో శనివారం ఆయన  మాట్లాడారు. హెల్త్‌ యూనివ ర్సిటీకి తిరిగి ఎన్టీఆర్‌ పేరు పెట్టేంతవరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదన్నారు. రిలే  దీక్షలో కొడవలూరు మండల టీడీపీ నాయకులు కోటంరెడ్డి  అమరేంద్రరెడ్డి, కరకటి మల్లికార్జున, గరికపాటి రాజేంద్ర, పిన్నమరెడ్డి మాధవరెడ్డి, చెక్కా మదన్‌, జ్యోతి సుమన్‌, నాసిన ప్రసాద్‌, చెముకుల వెంకయ్య తదితరులు కూర్చొన్నారు. 


Read more