టీడీపీ బలోపేతానికి మరింత కృషి

ABN , First Publish Date - 2022-09-30T03:36:36+05:30 IST

యోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ

టీడీపీ బలోపేతానికి మరింత కృషి
కరీముల్లాను సత్కరిస్తున్న మాలేపాటి తదితరులు

కావలి, సెప్టెంబరు29: నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా టీడీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,  నియోజకవర్గ పరిశీలకుడు షేక్‌ కరీముల్లా చెప్పారు.  పరిశీలకుడిగా కరీముల్లా నియమితులైన సందర్భంగా గురువారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడు అధ్యక్షతన  నేతలతో పరిచయ కార్యక్రమం జరిగింది. అనంతరం ఆయన్ను నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా కరీముల్లా మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో కావలిలో టీడీపీ జెండా రెపరెపలాడేలా  తన వంతు సహకారం అందిస్తానన్నారు.  మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ కరీముల్లాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని కోరారు. 


Read more