టీడీపీ బలోపేతానికి కృషిచేయండి

ABN , First Publish Date - 2022-02-20T03:14:57+05:30 IST

మండలంలో టీడీపీ బలో పేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాల్సి ఉందని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండల నేతలకు సూచించినట్లు మం

టీడీపీ బలోపేతానికి కృషిచేయండి
నారా చంద్రబాబు నాయుడుతో పెళ్లకూరు మండల నేతలు

పెళ్ళకూరు, ఫిబ్రవరి 19 :  మండలంలో  టీడీపీ బలో పేతానికి ప్రతి కార్యకర్త కృషిచేయాల్సి ఉందని  పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండల నేతలకు సూచించినట్లు మండల టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యద ర్శులు సంచి కృష్ణయ్య, దేవారెడ్డి నాగేంద్రప్రసాద్‌రెడ్డిలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం  టీడీపీ మద్దతుదారులైన సర్పంచులకు జరిగిన అవగాహన సద స్సుకు మండలం నుంచి పలువురు సర్పంచులు హాజర య్యారు.  సమావేశం అనంతరం చంద్రబాబును కలిసిన నేతలకు, ఆయన పలు సూచనలు ఇచ్చారు. మండలంలో జరగుతున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు తనకు తెలుస్తున్నా యని, ప్రతి నాయకుడు, కార్యకర్త నియోజకవర్గ ఇన్‌చార్జి నెలవల సుబ్రహ్మణ్యం అధ్వర్యంలో పార్టీ బలోపేతానికి కృషిచేయాలని ఆదేశించినట్లు వారు తెలిపారు.  పార్టీలో వర్గ విభేదాలు వీడి అందరూ ఐకమత్యంతో పనిచేయా ల్సిందిగా పెళ్ళకూరు, దొరవారిసత్రం నాయకులను ఆదేశించినట్లుగా వారు తెలిపారు. అనంతరం సర్పంచులు రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు బాబూ రాజేం ద్రప్రసాద్‌ను కూడా కలుసుకొని మాట్లాడారు. చంద్రబా బును కలిసిన వారిలో సర్పంచులు సురేష్‌, చింతపూడి సర్పంచి కుమారుడు కలవకోలు మునేష్‌, మణెయ్య, టీకే శ్రీనివాసన్‌, డీవీ సత్రం మండలం టీడీపీ అధ్యక్షుడు పెమ్మసాని శ్రీనివాసులనాయుడు తదితరులున్నారు. 


Read more