ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-07-05T05:40:53+05:30 IST

ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కరవది కార్తికేయ (27) అనే యువకు డు ఆత్మహత్య చేసుకున్న పట్టణంలోని ఉప్పుచెరువు ప్రాంతంలో

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

 కందుకూరు, జూలై 4: ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కరవది కార్తికేయ (27) అనే యువకు డు ఆత్మహత్య చేసుకున్న పట్టణంలోని ఉప్పుచెరువు ప్రాంతంలో సోమవారం చోటు చేసుకుం ది. కార్తికేయ నిరుద్యోగి కాగా చిన్నతనం నుంచే కొంత డిప్రెషన్‌ లక్షణాలతో బాధపడు తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరూ ఇంట్లో లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా సోమవారం కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.  కార్తికేయ తల్లిదండ్రులు చీరాలలో నివసిస్తుండగా ఇక్కడ నాయనమ్మ వద్ద ఉంటున్నాడు.  ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు చెబుతున్నారు. 

Read more