సబ్‌ జైలుకు పుస్తకాల అందజేత

ABN , First Publish Date - 2022-09-25T03:15:58+05:30 IST

స్థానిక సబ్‌జైల్‌కు స్వర్గీయ వెన్నెలకంటి వెంకటరమణయ్య జ్ఞాపకార్ధం ఆయన మనవడు డాక్టర్‌ వెన్నెలకంటి ప్రకాశం రూ.10 వే

సబ్‌ జైలుకు పుస్తకాల అందజేత
పుస్తకాలను బహూకరిస్తున్న వెన్నెలకంటి ప్రకాశం

ఆత్మకూరు, సెప్టెంబరు 24 : స్థానిక సబ్‌జైల్‌కు స్వర్గీయ వెన్నెలకంటి వెంకటరమణయ్య జ్ఞాపకార్ధం ఆయన మనవడు డాక్టర్‌ వెన్నెలకంటి ప్రకాశం రూ.10 వేల విలువ చేసే పుస్తకాలను అందజేశారు. శనివారం పుస్తకాలను సబ్‌జైలర్‌ కుమార్‌కు ఏఎస్‌పేట ప్రధానోపాధ్యాయులు సయ్యద్‌ అబ్దుల్‌హమీద్‌ చేతుల మీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ సందానిబాష,  మున్సిపల్‌ మాజీ వైస్‌ చైౖర్మన్‌ షేక్‌ సందాని, రెడ్‌క్రాస్‌ సభ్యులు సాధిక్‌బాష, యూటీఎఫ్‌, జూవీవీ నాయకులు హరికృష్ణ, వంటేరు మల్లికార్జున, మురళి తదితరులు పాల్గొన్నారు.


Read more