-
-
Home » Andhra Pradesh » Nellore » student medical checup ki helping-MRGS-AndhraPradesh
-
విద్యార్థి వైద్యానికి ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2022-06-08T03:08:35+05:30 IST
మండలంలోని గండిపాళెం గ్రామానికి చెందిన సుంకర హేమంత్ అనే విద్యార్థి బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాదులోని బసవతారకం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు.

ఉదయగిరి రూరల్, జూన్ 7: మండలంలోని గండిపాళెం గ్రామానికి చెందిన సుంకర హేమంత్ అనే విద్యార్థి బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతూ హైదరాబాదులోని బసవతారకం వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. హేమంత్ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో గ్రామానికి చెందిన జీఎంకే ట్రస్టు అధినేత, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు గుంటుపల్లి మాలకొండయ్యచౌదరి స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50 వేలు ఆర్థికసాయం చేసేందుకు పూనుకొన్నారు. ఈ మేరకు ట్రస్టు ప్రతినిధి దారపనేని చంద్ర మంగళవారం బసవతారకం కేన్సర్ వైద్యశాలకు చేరుకుని విద్యార్థి యోగక్షేమాలు తెలుసుకొని కుటుంబ సభ్యులకు ఆ నగదు అందజేశారు. ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరికొంత ఆర్థికసాయం చేసేందుకు కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చారు.